Friday, 6 November 2015

విదేశాల్లో నివసించే ఎన్నారైలు.. భారత్‌లోని తమ స్వంత ఆస్తులు అమ్మిన తర్వాత....

విదేశాల్లో నివసించే ఎన్నారైలు.. భారత్‌లోని తమ స్వంత ఆస్తులు అమ్మిన తర్వాత డబ్బును తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటారు. ‘హవాలా’ వంటి చట్టవ్యతిరేక విధానాల ద్వారా డబ్బును విదేశాలకు తరిలిస్తుంటారు. అది చాలా రిస్కుతో కూడుకున్నది. ఈ విధానం ద్వారా చాలామంది డబ్బును తిరిగి పొందలేరు. గతంలో భారత్‌ నుంచి విదేశాలకు లీగల్‌గా డబ్బులు తీసుకెళ్లడం చాలా కష్టమైన వ్యవహారంగా ఉండేది. అయితే అది ప్రస్తుతం కొంతవరకు సులభతరం అయింది. విదేశాలకు డబ్బులు తీసుకెళ్లడానికి కింది స్టెప్స్‌ ఫాలో కావాలి.
 
మొదట మీరు అమ్మిన ఆస్థి తాలూకు పూర్తి డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండాలి. ఈ అమ్మకం పూర్తిగా లీగల్‌ బ్యాంకింగ్‌ చానల్స్‌ ద్వారా జరగాలి. ఆ డబ్బును విదేశాలకు బదీలీ చేయాలంటే ముందుగా మీకు ఎన్‌ఆర్‌ఓ బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలి.
 
1) విదేశాలకు నగదు బదీలీ కోసం తొలుత భారత్‌లోని గుర్తింపు పొందిన సీఏ (చార్టెడ్‌ అకౌంట్‌)నుంచి ఓ సర్టిఫికేట్‌ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్‌ పేరు ‘ఫామ్‌ 15బి’. అంటే మీరు అమ్మిన ఆస్థి తాలూకు వారసులు మీరేనని, దానికి సంబంధించి ప్రభుత్వానికి అన్ని రకాల ట్యాక్సులు కట్టారా, లేదా అని అతను వెరిఫై చేసి ఆ ఫామ్‌ మీద సంతకం చేసి మీకు ఇస్తాడు.
 
2)తర్వాత కావాల్సిన సర్టిఫికేట్‌ ‘ఫామ్‌ 15సిఎ’. ఇది ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్లో ఉంటుంది. టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ అడ్రస్‌: www.tin-nsdl.com. ఈ ఫామ్‌ను సీఏ ఇచ్చిన ‘ఫామ్‌ 15బి’ సహాయంతో నింపి, సబ్‌మిట్‌ చేయాలి.
 
3)అనంతరం మీకు సిస్టమ్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ వస్తుంది. దానిని ప్రింటవుట్‌ తీసుకుని దానిపై సంతకం చేయాలి.
 
4)మీరు సంతకం చేసిన ఫామ్‌ 15సీఎ, సీఏ ఇచ్చిన ఫామ్‌ 15బి తీసుకుని మీ ఎన్‌ఆర్‌ఓ అకౌంట్‌ ఉన్న బ్యాంకుకు వెళ్లాలి. అక్కడ వారికి ఈ రెండు సర్టిఫికేట్‌లతోపాటు ప్రాపర్టీ సేల్‌ డాక్యుమెంట్‌, లీగల్‌ హెయిర్‌ సర్టిఫికేట్‌ అందజేయవలసి ఉంటుంది.
 
5)సంబంధిత సర్టిఫికెట్లు అందజేసిన వెంటనే మీ డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. అనంతరం బ్యాంకు వారు మీకు ఎ2 అనే ఫామ్‌, ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ ఫామ్‌ కూడా మీకు అందజేస్తారు.

No comments:

Post a Comment