Friday, 6 November 2015

విదేశాల్లో నివసించే ఎన్నారైలు.. భారత్‌లోని తమ స్వంత ఆస్తులు అమ్మిన తర్వాత....

విదేశాల్లో నివసించే ఎన్నారైలు.. భారత్‌లోని తమ స్వంత ఆస్తులు అమ్మిన తర్వాత డబ్బును తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటారు. ‘హవాలా’ వంటి చట్టవ్యతిరేక విధానాల ద్వారా డబ్బును విదేశాలకు తరిలిస్తుంటారు. అది చాలా రిస్కుతో కూడుకున్నది. ఈ విధానం ద్వారా చాలామంది డబ్బును తిరిగి పొందలేరు. గతంలో భారత్‌ నుంచి విదేశాలకు లీగల్‌గా డబ్బులు తీసుకెళ్లడం చాలా కష్టమైన వ్యవహారంగా ఉండేది. అయితే అది ప్రస్తుతం కొంతవరకు సులభతరం అయింది. విదేశాలకు డబ్బులు తీసుకెళ్లడానికి కింది స్టెప్స్‌ ఫాలో కావాలి.
 
మొదట మీరు అమ్మిన ఆస్థి తాలూకు పూర్తి డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండాలి. ఈ అమ్మకం పూర్తిగా లీగల్‌ బ్యాంకింగ్‌ చానల్స్‌ ద్వారా జరగాలి. ఆ డబ్బును విదేశాలకు బదీలీ చేయాలంటే ముందుగా మీకు ఎన్‌ఆర్‌ఓ బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలి.
 
1) విదేశాలకు నగదు బదీలీ కోసం తొలుత భారత్‌లోని గుర్తింపు పొందిన సీఏ (చార్టెడ్‌ అకౌంట్‌)నుంచి ఓ సర్టిఫికేట్‌ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్‌ పేరు ‘ఫామ్‌ 15బి’. అంటే మీరు అమ్మిన ఆస్థి తాలూకు వారసులు మీరేనని, దానికి సంబంధించి ప్రభుత్వానికి అన్ని రకాల ట్యాక్సులు కట్టారా, లేదా అని అతను వెరిఫై చేసి ఆ ఫామ్‌ మీద సంతకం చేసి మీకు ఇస్తాడు.
 
2)తర్వాత కావాల్సిన సర్టిఫికేట్‌ ‘ఫామ్‌ 15సిఎ’. ఇది ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్లో ఉంటుంది. టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ అడ్రస్‌: www.tin-nsdl.com. ఈ ఫామ్‌ను సీఏ ఇచ్చిన ‘ఫామ్‌ 15బి’ సహాయంతో నింపి, సబ్‌మిట్‌ చేయాలి.
 
3)అనంతరం మీకు సిస్టమ్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ వస్తుంది. దానిని ప్రింటవుట్‌ తీసుకుని దానిపై సంతకం చేయాలి.
 
4)మీరు సంతకం చేసిన ఫామ్‌ 15సీఎ, సీఏ ఇచ్చిన ఫామ్‌ 15బి తీసుకుని మీ ఎన్‌ఆర్‌ఓ అకౌంట్‌ ఉన్న బ్యాంకుకు వెళ్లాలి. అక్కడ వారికి ఈ రెండు సర్టిఫికేట్‌లతోపాటు ప్రాపర్టీ సేల్‌ డాక్యుమెంట్‌, లీగల్‌ హెయిర్‌ సర్టిఫికేట్‌ అందజేయవలసి ఉంటుంది.
 
5)సంబంధిత సర్టిఫికెట్లు అందజేసిన వెంటనే మీ డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. అనంతరం బ్యాంకు వారు మీకు ఎ2 అనే ఫామ్‌, ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ ఫామ్‌ కూడా మీకు అందజేస్తారు.

చిరంజీవి పెద్ద కొడుకును నేనేనంటూ సుజిత్ అలియాస్ రవీందర్ అనే యువకుడు సంచలనానికి తెరతీశాడు



 

చిరంజీవి పెద్ద కొడుకును నేనేనంటూ సుజిత్ అలియాస్ రవీందర్ అనే యువకుడు సంచలనానికి తెరతీశాడు. చిరంజీవికి తానే పెద్ద కొడుకునని కావాలంటే డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ శుక్రవారం హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో తాను నటించానంటూ చెబుతున్నాడు.  ఈ ఘటనపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా బోగస్‌ అని, చిరంజీవి ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని కొట్టిపారేశారు. పసివాడి ప్రాణంలో చిరంజీవి కొడుకుగా నటించింది అమ్మాయని వారు వివరణ ఇచ్చారు. 28 ఏళ్ల కిందట సినిమా రాగా..కొడుకునంటూ ఇప్పుడు అతను చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చిరంజీవి అభిమానులు మండిపడ్డారు. సంచలనం చేసి ఏ విధంగానైనా వార్తల్లో నిలవాలన్న కాంక్షతోనే రవీందర్‌ డ్రామా ఆడుతున్నారని మెగా అభిమానులు విమర్శించారు. రవీందర్‌కు మతి భ్రమించిందని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Monday, 2 November 2015

 


Rajamouli Has 2 Heroes In List For 1000 Crore Project Named "Garuda" After Bahubali-2

-Chameleon

So what is Garuda Story ?

Garuda is a humanoid bird and he is considered to be eternal enemy of Nagaraja (snake). This eagle kind creature mainly feed on snakes. According to sources the plot of this movie will be the war between Garuda and Nagaraja, where the Nagaraja character could be played by Malayalam Super star Mohan lal. So even we are excited to see who is the Garuda. It is said it would take 2 years at least for the movie to hit the floor.


 http://telugu.v6news.tv/img/2015/11/gun1.jpg





గొలుసు దొంగతనాలతో నగరవాసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న చైన్ స్నాచర్లకు తమదైన శైలిలో బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే యాంటి చైన్ స్నాచింగ్ టీమ్ ఏర్పాటు చేసిన పోలీసులు.. తాజాగా సిటీలో తమ ఉనికిని చాటారు. హైదరాబాద్ వనస్థలిపురం దగ్గరలోని ఆటోనగర్ లో చైన్ స్నాచింగ్ కు ప్రయత్నించిన దొంగలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. స్థానిక రాజధాని హోటల్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న యువతి నుంచి స్నాచింగ్స్ కు పాల్పడుతుండగా.. గుర్తించిన ప్రత్యేక బృందం పోలీసులు కాల్పులు జరిపారు. తూటాల నుంచి తప్పించుకున్న దొంగలు పరారయ్యారు. కాల్పులతో జనం షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక పరుగులు తీశారు. దొంగల కోసం వేట మొదలుపెట్టారు ఖాకీలు.

ఆ నెంబరు చెబుతే మీ డబ్బు


  ఫోన్‌ చేసి హిందీలోనో, ఇంగ్లిషులోనే మాట్లాడతారు. బ్యాంకు ఖాతాకు లింక్‌ చేస్తున్నామని చెబుతారు. లేకపోతే మీ అకౌంట్‌ లావాదేవీలు నిలిచిపోతాయని చెబుతారు. మీ పేరు, వివరాలు చెబుతారు. నిజమైన బ్యాంకు అధికారులుగా నమ్మించి మీ డెబిట్‌ కార్డు మీద ఉన్న 16 అంకెల కోడ్‌ను రాబట్టుకుంటారు. ఆ తర్వాత మూడు అంకెల సీవీవీ (కార్డు వెరిఫికేషన్‌ వాల్యూ) నెంబరు అడుగుతారు. మీ ఫోన్‌కు ఓ కోడ్‌ నంబరు పంపుతామని చెబుతారు. ఫోన్‌ చేసి ఆ ఆరు అంకెల ఓటీపీ నెంబరు అడుగుతారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ఓటీపీ నెంబరును ఖాతాదారులు చెప్పేస్తున్నారు. ఎక్కడో దూరంగా ఉండి మన డెబిట్‌ కార్డు వివరాలతో ఇతరులు ఆన్‌లైన్‌లో పర్చేజ్‌ చేయకుండా సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సిస్టమే ఓటీపీ నెంబరు. ఈ సెక్యూరిటీ నెంబరును కూడా ఖాతాదారులు చెప్పేయడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
నగరంలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థి సెల్‌కు ఫోన్‌ వచ్చింది. ఆమె ఫోన్‌ గ్రామంలో ఉండడంతో ఆ ఫోన్‌ ఎత్తిన కుటుంబ సభ్యులకు విషయం అర్థం కాలేదు. ఏదో బ్యాంకు నుంచి ఫోన్‌ వచ్చిందని గ్రహించారు. రిసీవ్‌ చేసుకున్న ఆ నెంబరును నగరంలో ఉన్న విద్యార్థికి ఫోన్‌లో చెప్పారు. హిందీ వచ్చిన తోటి విద్యార్థితో ఆ నెంబరుకు ఫోన్‌ చేయించింది. సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసిన యువతి అకౌంట్‌ వివరాలు సేకరించారు. ఖాతాలో ఉన్న రూ.4 వేలతో ఆన్‌లైన్‌ పర్చేజ్‌ చేశాడు. వెంటనే తన ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశాడు. వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండేది. కానీ ఈ విషయం తెలియక ఫిర్యాదు చేయకపోవడంతో ఆ డబ్బును నష్టపోవాల్సివచ్చింది. నగరంలో జరగుతున్న నేరాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే.
10 నెలల వ్యవధిలో 5 వేల ఫిర్యాదులు
జంట కమిషనరేట్ల పరిధిలోని సైబర్‌ క్రైం స్టేషన్లకు ఈ 10 నెలల వ్యవధిలోనే 5 వేల ఫిర్యాదులు వచ్చాయి. నిత్యం బాధితులు అధిక సంఖ్యలో స్టేషన్‌కు వస్తుండడంతో పోలీసులు విస్తుపోతున్నారు. బాధితుల్లో 99 శాతం ఉన్నత విద్యావంతులే ఉంటున్నారు. ఫోన్‌కు ఓటీపీ నెంబరు మెసేజ్‌ వచ్చి నప్పుడు ఆ నెంబరు ఇతరులకు చెప్పవద్దని సూచిస్తూ (డోంట్‌ షేర్‌ యువర్‌ ఓటీపీ నెంబరు) అన్న మెసేజ్‌ ఉంటుంది. అయితే, ఈ నెంబరును ఆన్‌లైన్‌ మోసగాళ్లకు చెప్పేస్తుండడంతో దొంగకు తాళం ఇచ్చినట్లు ఉంది. ఇలా నగరంలో ఏడాదిలో ఇప్పటి వరకు రూ.5 కోట్ల నగదును ఆన్‌లైన్‌ మోసగాళ్లు దోచుకున్నట్లు అంచనా.
50 వేల సిమ్‌ కార్డులతో వల..
నిందితుల వద్ద 50 వేల సిమ్‌ కార్డులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒక్కో సిమ్‌ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురిని మోసం చేసి ఆ సిమ్‌ను నాశనం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎక్కువగా బిహార్‌, జార్ఖండ్‌, హర్యానా, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్‌ కేంద్రంగా మోసగాళ్లు ఖాతాదారులపై వల విసురుతున్నారు. బాధితుల్లో మొదటి స్థానంలో ఎస్‌బీఐ ఖాతాదారులు, రెండో స్థానంలో ఎస్‌బీహెచ్‌ ఖాతాదారులు ఉంటున్నారు. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు వివరాలు మోసగాళ్ల చేతికి చిక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని బ్యాంకులు తమ బ్యాంకు లావాదేవీలను ఆడిట్‌ చేసే పనిని అవుట్‌సోర్సింగ్‌కి ఇస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో బ్యాంకు ఖాతాదారులు వివరాలు బయటికి వెళ్లడం గాని, బ్యాంకుల వెబ్‌సైట్లు హ్యాకింగ్‌ జరిగిఉండవచ్చని సైబర్‌ పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఆధారాలు లేకుండా...
మోసగాళ్లు ఎస్‌బీఐ బుడ్డీ, పేయూ వంటి ఆన్‌లైన్‌ ఖాతాలకు డబ్బు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి మొబైల్‌ రీచార్జిలతో పాటు ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరుపుతున్నారు. వారు కొనుగోళ్లు జరిపినప్పుడు ఖాతాదారుని సెల్‌ఫోన్‌కి పీవోఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌) నెంబరు, లావాదేవీల ఐడీ, నేమ్‌ ఆఫ్‌ ది ఆన్‌లైన్‌ మర్చంట్‌ వివరాలతో మెసేజ్‌ వస్తుంది. ఆన్‌లైన్‌ కొనుగోలుకు ఇదే కచ్చితమైన ఆధారమవుతోంది. ఈ ఆధారం కూడా లేకుండా చేయడానికి మోసగాళ్లు ఖాతాదారునికి ఫోన్‌ చేసి ఈ మెసేజ్‌ని డీలీట్‌ చేయిస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే కీలకమైన ఈ ఆధారం కూడా ఖాతాదారుల వద్ద ఉండడం లేదు. మోసం జరిగిందని గుర్తించి మెసేజ్‌ సమాచారం కోసం బ్యాంకుకు వెళ్లినా అప్పటికే సమయం మించి పోతోంది. దీంతో మోసపోయిన నగదులో నయాపైసా కూడా ఖాతాదారులకు తిరిగి రావడం లేదు.